JP Nadda : జేపీ నడ్డా ఫోటో ఏర్పాటుపై బీజేపీ ఫైర్
ఇది టీఆర్ఎస్ పనేనంటున్న బీజేపీ
JP Nadda : తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా, అత్యంత జుగుస్సాకరంగా తయారయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఫోటోను అభ్యంతకరంగా ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది ఆ పార్టీ. రాష్ట్రంలోని మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది.
ఇప్పటికే జేపీ నడ్డా రోడ్ మ్యాప్ ఖరారు చేసింది బీజేపీ. ఈ తరుణంలో పోటా పోటీగా ఫ్లెక్సీలు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నాయకులు. తాజాగా మునుగోడు లోని చౌటుప్పల్ ప్రాంతంలో ప్రాంతీయ ఫ్లోరైడ్ నివారణ, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
దీనిని ప్రస్తావిస్తూ కొందరు జేపీ నడ్డా ఫోటోను అభ్యంతరకరమైన రీతిలో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన గురువారం తెర పైకి వచ్చింది. గతంలో 2016లో నడ్డా సందర్శించారు. ఆ సమయంలో మల్కాపురంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ మండిపడింది. నేతలు తీవ్రంగా ఖండించారు. దీని వెనుక టీఆర్ఎస్ కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. సమాధి తవ్వి జేపీ నడ్డా(JP Nadda) బొమ్మ పెట్టడం మూర్ఖత్వం. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వినాశకాలే విపరీత బుద్ది అంటూ ట్వీట్ చేసింది. ఇది మంచి పద్దతి కాదన్నారు కేంద్ర మంత్రి పూరి.
ఇదిలా ఉండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఈ చర్యకు పాల్పడిందంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా ఆరోపించారు.
Also Read : ఢిల్లీ పోలీస్ బాస్ కు ఫుల్ పవర్స్