Nitish Kumar BJP : నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది
తేజస్వి యాదవ్ కు బీజేపీ హితబోధ
Nitish Kumar BJP : బీహార్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, భారతీయ జనతా పార్టీ(BJP) మధ్య 17 ఏళ్ల బంధం విడి పోయింది. కొత్త స్నేహం మొదలు పెట్టారు.
బీహార్ రాష్ట్ర చరిత్రలో ఎనిమిదవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో నితీశ్ కుమార్(Nitish Kumar) చరిత్ర సృష్టించారు. తాజాగా తనను టార్గెట్ చేస్తూ తన వెనుకే గోతులు తవ్వేందుకు బీజేపీ యత్నిస్తోందంటూ భయపడ్డారు నితీశ్ కుమార్.
ఆపై వెంటనే తేరుకుని ముందు జాగ్రత్తగా కాషాయానికి కటీఫ్ చెప్పారు. ఆపై వెంటనే జస్ట్ 24 గంటల్లోపే ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంల్, తదితర పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ లేదా మహా కూటమిని ఏర్పాటు చేశారు.
సీఎంగా నితీశ్ గా కొలువు తీరితే డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఆసీనులయ్యారు. సీన్ మారింది కానీ పాత్రలు మారలేదు. పవర్ మాత్రం
నితీశ్ కుమార్ చేతుల్లోనే ఉంది.
ఇది ఆయన రాజకీయ చాతుర్యానికి మచ్చుతునక. ప్రమాణ స్వీకారం ముగిశాక భారతీయ జనతా పార్టీ నిందారోపణలు చేయడం మొదలు పెట్టింది.
నితీశ్ కుమార్ నయవంచకుడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఆపై తేజస్వి యాదవ్ కు గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు రోజులు ఆగితే ఆయన నైజం ఏమిటో నీకు అర్థం అవుతుందంటూ ఎద్దేవా చేసింది. ఒక రకంగా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మరాఠాలో ఏక్ నాథ్ షిండే మోడల్ ను బీహార్ లో అమలు చేద్దామని
అమిత్ షా ప్లాన్ చేశాడు.
కానీ వర్కవుట్ కాలేదు. నితీష్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సంకీర్ణ ధర్మాన్ని తాము పాటించామని కానీ బీజేపీనే దానిని తుంగలో తొక్కిందన్నారు
నితీశ్ కుమార్.
అమిత్ షా ఫోన్ చేసి చెప్పినా పట్టించు కోలేదంటోంది బీజేపీ. ఇతర పార్టీలకు భవిష్యత్తు లేదు. బీహార్ లో బీజేపీదే రాజ్యమంటున్నారు జేపీ నడ్డా.