BJP Strong Reply : ప్రతిపక్షాల లేఖకు బీజేపీ కౌంటర్
9 రాష్ట్రాలు 9 ప్రెస్ మీట్లతో ఆన్సర్
BJP Opposition Letter : కేంద్రంలో నరేంద్ర మోదీ కొలువు తీరిన తర్వాత దేశంలో అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 9 పార్టీలకు చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ(BJP Opposition Letter) రాశారు. కావాలని సీబీఐ , ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ రాష్ట్రాలలో కాకుండా కేవలం బీజేపీయేతర రాష్ట్రాలను, నాయకులను, సంస్థలను టార్గెట్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎంకు రాసిన లేఖలో సీఎంలు మమతా బెనర్జీ, కేసీఆర్ , భగవంత్ మాన్ , అరవింద్ కేజ్రీవాల్ , ఎంకే స్టాలిన్ , విజయన్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు చేసిన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్(BJP Opposition Letter) కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలలో ఎవరు ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపై క్లారిటీ ఇచ్చింది. గురువారం కీలక ప్రకటన చేసింది. 9 రాష్ట్రాలలో 9 ప్రెస్ మీట్లు పెట్టి ఏకి పారేయాలని నిర్ణయించింది.
ఢిల్లీ, పంజాబ్ , జమ్మూ కాశ్మీర్ , మహారాష్ట్ర, బెంగాల్ , కేరళ వంటి రాష్ట్రాలలో ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ఢిల్లీలో , సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ లో, సంజయ్ జైశ్వాల్ బీహార్ లో , బ్రిజేష్ పాఠక్ యూపీలో , బండి సంజయ్ తెలంగాణలో ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. భారత దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కావాలని లాలూపై సీబీఐ దాడులు