Rivaba Jadeja Patel : హార్దిక్ ప‌టేల్..జ‌డేజా భార్య‌కు బీజేపీ టికెట్

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ల లిస్టు డిక్లేర్

Rivaba Jadeja Patel : గుజ‌రాత్ లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను ఖ‌రారు చేసింది.

ఇందులో ఊహించ‌ని రీతిలో మాజీ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజాతో(Rivaba Jadeja) పాటు ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి గుడ్ బై చెప్పి కాషాయ కండువా క‌ప్పుకున్న హార్దిక్ ప‌టేల్ కు(Hardik Patel) టికెట్లు కేటాయించింది. ప‌టేల్ కు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.

గ‌త ఎన్నికల్లో ఆయ‌న కాంగ్రెస్ లో ఉన్నారు. ఈసారి బీజేపీ నుంచి బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఇక ర‌వీంద్ర జ‌డేజాకు క్రికెట్ ప‌రంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడాడు. ఇటీవ‌లే త‌ను, భార్య‌తో క‌లిసి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని(PM Modi) క‌లిశారు.

ఇదిలా ఉండ‌గా జ‌డేజా భార్య మూడేళ్ల కింద‌ట భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ప్ర‌స్తుతం ఆమెకు కూడా ల‌క్ క‌లిసి వ‌చ్చింది అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఇవాళ భార‌తీయ జ‌న‌తా పార్టీ 160 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇంకా 22 స్థానాల‌కు ఖ‌రారు చేయాల్సి ఉంది.

ఈసారి ఎన్నిక‌ల్లో జామ్ న‌గ‌ర్ పార్టీ అభ్య‌ర్థిగా రివాబా జ‌డేజాను నిల‌బెట్టింది. ఇక సీఎం భూపేంద్ర ప‌టేల్ ఘ‌ట్లోడియా నుండి పోటీ చేయ‌బోతున్నారు. సీనియ‌ర్ల‌ను, మాజీ సీఎం రూపానిని ఈసారి పోటీలో దించ‌క పోవ‌డం విశేషం.

Also Read : ప్రాణాలు కాపాడిన అమృతియాకు టికెట్

Leave A Reply

Your Email Id will not be published!