Kantilal Amrutiya : ప్రాణాలు కాపాడిన అమృతియాకు ఛాన్స్
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ
Kantilal Amrutiya : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ లోని మోర్బీ వంతెన ఘటనలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో చోటు చేసుకున్న అతి పెద్ద విషాదం. ఈ ఘటనలో 177 మందికి పైగా గాయపడ్డారు.
ఇదిలా ఉండగా నదిలోకి దూకి ప్రాణాలు పోకుండా కాపాడిన 60 ఏళ్ల వయస్సు కలిగిన కాంతిలాల్ అమృతియాకు(Kantilal Amrutiya) భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. ఈ నిర్ణయం సంచలనం రేపింది పార్టీ వర్గాలలో.
కాంతిలాల్ అమృతియా చేసిన సాహసానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తు పోయారని, ఈ మేరకు ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ కేంద్ర పార్లమెంట్ ఎన్నికల కమిటీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా కాంతిలాల్ అమృతియా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలపడంతో హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోర్బీ వంతెన కూలిన ఘటనకు సంబంధించి నియోజకవర్గం మోర్బీకి మోర్దా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను పార్టీ తొలగించింది.
ఈ మేరకు కాంతిలాల్ అమృతియాకు(Kantilal Amrutiya) ప్రస్తుతం టికెట్ కేటాయించింది. ఇదిలా ఉండగా మోర్బీ ఘటన అక్టోబర్ 30న చోటు చేసుకుంది. ఆనాటి బ్రిటీషర్ల కాలంలో మోర్బీ వంతెనను నిర్మించారు. బ్రిడ్జి కేబుల్స్ తెగి పోవడంతో వందలాది మంది నదిలో పడి పోయారు.
వారిని రక్షించేందుకు కాంతిలాల్ అమృతియా నదిలోకి దూకారు. ఇది అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read : గుజరాత్ బీజేపీలో సీనియర్లకు నో ఛాన్స్