Fadnavis & Eknath Shinde : ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ
రెబల్స్ మద్దతుతో అతి పెద్ద పార్టీ
Fadnavis & Eknath Shinde : అంతా అనుకున్నట్టే జరిగింది. ఎట్టకేలకు తన వైపు ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడంతో పాటు సుప్రీంకోర్టు బలపరీక్షకు సంబంధించి జోక్యం చేసుకోబోనంటూ స్పష్టం చేయడంతో ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఆ మేరకు గవర్నర్ కోష్యార్ ఆమోదించారు. ఇక రెబల్స్ కు సారథ్యం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభా పక్ష సమావేశంలో భేటీ అయ్యారు. గౌహతి నుంచి గోవాకు బయలు దేరిన ఎమ్మెల్యేలు తిరిగి వచ్చారు.
గవర్నర్ వారితో సమావేశం కానున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇదే విషయాన్ని గవర్నర్ కు స్పష్టం చేసింది.
వినతిపత్రం కూడా సమర్పించింది. శివసేనలో తిరుగుబాటు ప్రకటించిన వారంతా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు లేఖ కూడా గవర్నర్ కు సమర్పించారు.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేంద్రంలోని బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను చేర దీయడం, ప్రభుత్వాలను కూల్చడం పనిగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇవాళ మరాఠాలో సేమ్ సీన్ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా మంత్రి పదవులకు సంబంధించి బీజేపీతో ఇంకా సంప్రదింపులు జరపలేదని, ఆ పుకార్లను నమ్మవద్దంటూ ఏక్ నాథ్ షిండ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా మరో మూడు రోజుల్లో సర్కార్ ను ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నాయకుడు గిరీష్ మహాజన్. ప్రస్తుతానికి ఏర్పాటు చేసే కొత్త సర్కార్ కు సీఎంగా ఫడ్నవీస్ , డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే (Fadnavis & Eknath Shinde) రేసులో ఉన్నారు.
Also Read : శివ సైనికులం బాలా సాహెబ్ వారసులం