JP Nadda : కుటుంబ పార్టీల‌పై బీజేపీ పోరాటం – జేపీ న‌డ్డా

మా పార్టీలో కుటుంబ పాల‌న అంటూ లేదు

JP Nadda : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా(JP Nadda)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే ప్ర‌భుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేశారు.

దేశంలో కుటుంబ పార్టీలు పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాము వాటికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చెన్నైలో జేపీ న‌డ్డా శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

ఆనాటి రాజ వంశాల‌ను కంటిన్యూ చేస్తున్నాయంటూ డీఎంకే, కాంగ్రెస పార్టీల‌ను దృష్టిలో పెట్టుకుని ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోందా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేశారు.

ఇదిలా ఉండ‌గా కొత్త విద్యా విధానం, నీట్ పై రాష్ట్రం వ్య‌తిరేకించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చ‌దువుకోని వాళ్లు సీఎంలుగా ఉంటే ఇలాగే ఉంటుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జేపీ న‌డ్డా.

అవిద్యార‌హితులు వ్య‌వ‌హారాల‌కు సార‌థ్యం వ‌హిస్తే ఇలాగే జ‌రుగుతుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా జేపీ న‌డ్డా(JP Nadda)  చేసిన కామెంట్స్ ను సీరియ‌స్ గా తీసుకుంది డీఎంకే. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి విద్యార్హ‌త‌ల‌ను అడిగే స్థాయికి దిగ‌జార‌బోమంటూ పేర్కొంది.

జే షా ఎవ‌రు. ఆయ‌న ఎన్ని సెంచ‌రీలు కొట్టాడో జేపీ న‌డ్డా చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండ‌గా జేపీ న‌డ్డా మ‌మ‌తా బెన‌ర్జీ, కేసీఆర్ ను కూడా ఇందులోకి లాగే ప్ర‌య‌త్నం చేశారు.

మొత్తంగా జేపీ న‌డ్డా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి త‌మిళ‌నాడు రాష్ట్రంలో. ఇంకోసారి నోరు జారితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది డీఎంకే.

Also Read : విద్యుత్ బిల్లు చ‌ట్టంగా మారితే ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!