Tajinder Bagga : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను(Tajinder Bagga) పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ వెల్లడించారు. ఉదయం 8.30 గంటల సమయంలో దాదాపు 50 మమంది పోలీసులు ఢిల్లీలో ఉంటున్న బగ్గా ఇంట్లోకి చొరబడి అదుపులోకి తీసుకున్నారని ఆరోపించాడు.
ఇదిలా ఉండగా బగ్గాను పట్టుకునే ముందు పంజాబ్ పోలీసులు స్థానిక ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బెదిరించినందుకు బగ్గాను అరెస్ట్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్వాన్ ట్వీట్ లో వెల్లడించారు.
పంజాబ్ పోలీసులపై నోరు పారేసుకున్నాడు. అంతే కాదు ఆప్ చీఫ్ ను నానా దుర్బాషలాడాడు. నిన్ను బతకనీయనంటూ హెచ్చరించాడు. అందుకే బగ్గాను(Tajinder Bagga) అదుపులోకి తీసుకున్నారని తెలిపాడు.
కాగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా బగ్గా అరెస్ట్ గురించి ప్రస్తావించ లేదు. అయితే రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకునేందుకు పంజాబ్ పోలీసులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
అయితే తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను ఎలా కాపాడు కోవాలో తమకు బాగా తెలుసునని పేర్కొన్నాడు. ఈ విషయం ఆప్ గుర్తిస్తే మంచిదన్నాడు.
బగ్గాను(Tajinder Bagga) కావాలనే అరెస్ట్ చేశారంటూ ఆరోపించాడు. ఏది ఏమైనా ఇది వ్యక్తిగత కక్షగా తాము భావిస్తున్నట్లు మండిపడ్డారు.
Also Read : India Govt : కరోనా మరణాల నివేదికపై కేంద్రం గుస్సా