Kabul Blast : పవిత్ర రంజాన్ మాసంలో ఆఫ్తనిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. ప్రార్థన సమయంలో కాబూల్ మసీదులో పేలుడు (Kabul Blast)సంభవించి 50 మందికి పైగా మరణించారు. ఆస్పత్రులకు ఇప్పటి దాకా 66 మృతదేహాలు రాగా 78 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
ఆఫ్గాన్ లోని కాబూల్ మసీదులో పేలుడు సంభవించింది. మానవ బాంబు నిర్వాకమేనని సమాచారం. ప్రార్థనల అనంతరం శక్తివంతమైన పేలుడు సంభవించింది.
పౌర లక్ష్యాలపై వరుస దాడులతో దద్దరిల్లుతోంది. రాజధానికి పశ్చిమాన ఉన్న ఖలీఫా సాహిబ్ మసీదులో తెల్లవారుజామున పేలుడు సంబవించిందని ఆప్గనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి బెస్ముల్లా హబీబ్ వెల్లడించారు.
మృతుల సంఖ్య అధికారికంగా ధ్రువీకరించారు. సున్నీ మసీదులోని ఆరాధాకులు ప్రార్థనల తర్వాత జిక్ర్ అని పిలువబడే సమాజం కోసం గుమిగూడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇది కొంత మంది ముస్లింలు ఆచరించే మత పరమైన స్మారక చర్య. కొన్ని కరుడుగట్టిన సున్నీ గ్రూపులు మత విశ్వాసంగా భావించారు. మసీదు అధిపతి సయ్యద్ ఫాజిట్ అఘా మాట్లాడారు.
ఆత్మాహుతి బాంబర్ గా గుర్తించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. చని పోయిన వారిలో తన మేనల్లుడు కూడా ఉన్నారని చెప్పారు.
నేను ఒక్కడినే ప్రాణాలతో బయట పడ్డా. కానీ నా వాళ్లను కోల్పోయానని వాపోయాడు. ఆఫ్గనిస్తాన్ లో చోటు చేసుకున్న పేలుడు ఘటన కలకలం రేపింది.
ఆఫ్గనిస్తాలో పేలుడు ఘటనను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇది నీచమైన చర్యగా అభివర్ణించింది.
Also Read : యుద్ధం ఆపడంలో భద్రతా మండలి వైఫల్యం