Bob Iger : ట్విట్టర్ పై డిస్నీ మాజీ సీఇఓ కామెంట్స్
2016లో అత్యధికం నకిలీ ఖాతాలే
Bob Iger : ప్రపంచంలోనే పేరొందిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ పై నోరు పారేసుకున్నాడు డిస్నీ మాజీ సిఇఓ బాబ్ ఇగర్.(Bob Iger) ఇప్పటికే దానిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసి తర్వాత విరమించుకున్న ప్రముఖ బిలియనీర్ టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు.
తనకు పూర్తిగా ట్విట్టర్ లో మొత్తం ఎంత మంది ఖాతాదారులు ఉన్నారో, వారి వివరాలు కావాలని అడిగాడు. ప్రధానంగా ఫేక్ లేదా స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశాడు.
దీనిపై ట్విట్టర్ అంతగా స్పందించ లేదు. $44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ముందు మస్క్ ఒప్పందం చేసుకున్నాడు.
కానీ తర్వాత తాను విరమించు కుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ట్విట్టర్, ఎలోన్ మస్క్ మధ్య కోర్టులో వార్ నడుస్తోంది. ఈ తరుణంలో డిస్నీ మాజీ సిఇఓ కీలక కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.
దీనీని పూర్తిగా ఖండించారు ప్రస్తుత ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్(Parag Agarwal). ట్విట్టర్ కు సంబంధించిన వినియోగదారులు లేదా ఖాతాదారులు గణనీయంగా నకిలీవే అయి ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే విషయాన్ని తమ డిస్నీ సంస్థ తెలుసుకుందని స్పష్టం చేశారు. కాగా డిస్నీ మాజీ సిఇఓ బాబ్ ఇగర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
దీనిపై ఇంకా స్పందించ లేదు ట్విట్టర్ ఫౌండర్, మాజీ సిఇఓ డోర్సీ, పరాగ్ . ఒక రకంగా బాబ్ ఇగర్ చేసిన ఈ వ్యాఖ్యలు గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన ఎలోన్ మస్క్ కు మద్దతుగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
Also Read : సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు