Bomb Threat : ఇరాన్ చైనా విమానానికి బాంబు బెదిరింపు
అనుమతి నిరాకరించిన భారత ప్రభుత్వం
Bomb Threat : ఇరాన్ – చైనా ప్యాసింజర్ విమానాం బాంబు బెదిరింపునకు గురైంది. దీంలో ల్యాండింగ్ చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. భారత గగనతలంలో ఉన్న మహాన్ ఎయిర్ విమానానికి సాంకేతిక కారణాల వల్ల భారత దేశంలో ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా ఇరాన్ ప్యాసింజర్ విమానం ఢిల్లీకి చేరుకునే సమయంలో బాంబు బెదిరింపు(Bomb Threat) రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానయాన సంస్థకు బాంబు బెదిరింపు వచ్చినప్పుడు భారత గగన తలంలో ఉన్న మహాన్ ఎయిర్ విమానానికి సాంకేతిక కారణాలతో ల్యాండ్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.
కాగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ఫైట్ రాడార్ ప్రకారం ఐఆర్ఎం081 నెంబర్ కలిగిన విమానం ఇరాన్ లోని టెహ్రాన్ నుండి చైనా లోని గ్యాంగ్ జౌకు వెళుతోంది. ఢిల్లీ, జైపూర్ లో ఫ్లైట్ దిగేందుకు అనుమతి లేక పోవడంతో అధికారుల క్లియరెన్స్ తర్వాత చైనాకు ప్రయాణాన్ని కొనసాగించింది.
సోమవారం ఉదయం 9.20 గంటలకు విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అధికారులు వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్ కు అనుమతి కోరారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అనుమతి లభించక పోవడంతో జైపూర్ కు మళ్లించారు.
ఇదిలా ఉండగా జైపూర్ లోనూ దిగేందుకు వీలు లేదు. ఆ తర్వాత విమానం చైనాకు తన అసలు మార్గాన్ని అనుసరించింది. అనంతరం ఎయిర్ పోర్టు అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో ఇరాన్ నుంచి చైనాకు బయలుదేరిన విమానం తిరిగి చైనాకు సేఫ్ గా బయలు దేరింది.
Also Read : పంజాబీ సింగర్ అల్ఫాజ్ పై దాడి