#ChinnaJeeyar : పుస్త‌కాలు లోకాన్ని ఆవిష్క‌రించే దీపాలు- చిన‌జీయ‌ర్ స్వామీజీ

అనుభ‌వ‌సార‌మంతా ఆ పుస్త‌కాల్లో నిక్షిప్త‌మై ఉంటాయి

Chinna Jeeyar : నాకు ఏ రాజ్యాలు వ‌ద్దు. నోట్ల క‌ట్ట‌లు వ‌ద్దే వ‌ద్దు. న‌న్ను మ‌నిషినిగా చేసే పుస్త‌కాలు ఇవ్వండి చాలు అంటారు ఓ సంద‌ర్భంలో బుద్ధుడు. ప్ర‌తి ఊరు బాగుప‌డాలి. బాగుండాలి కూడా..ప్ర‌తి బ‌డిలో గంట మోగాలి. ప్ర‌తి గుడిలో దీపం వెల‌గాలి. అపుడే ఆ గ్రామానికి వెలుగు వ‌స్తుంది. విద్య
వికాసాన్ని క‌లిగిస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేలా చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ..ఎన్నో త‌రాలుగా మ‌నం నేర్చుకోవాల్సిన అనుభ‌వ‌సార‌మంతా ఆ పుస్త‌కాల్లో నిక్షిప్త‌మై ఉంటాయి. ఇంట‌ర్నెట్ ఆధిప‌త్యం చెలాయిస్తున్నా..సామాజిక మాధ్య‌మాలు త‌మ ప్ర‌భావాన్ని
చూపిస్తున్నా ఇంకా ఈ ఆధునిక కాలంలో పుస్త‌కాల ప్ర‌చుర‌ణ పెరుగుతూనే వ‌స్తోంది.

అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌త్రిక‌లు, పుస్త‌కాల ముద్ర‌ణ రెట్టింప‌వుతోంది. అభివృద్ధి జ‌రుగుతోంది. కాద‌న‌లేం. కానీ మ‌నుషుల్ని వేరు చేసి యంత్రాలుగా మార్చే ఏ వ్య‌వ‌స్థా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన దాఖ‌లాలు లేవు. ఉన్న‌ద‌ల్లా స‌మాజాన్ని కాపాడుకోవ‌డ‌మే. మ‌నం మారాల‌న్నా..విచ‌క్ష‌ణా జ్ఞానం అల‌వ‌డాల‌న్నా..మ‌నుషులుగా సాటి వారి ప‌ట్ల ప్రేమ‌ను పంచాల‌న్నా పుస్త‌కాలు చ‌ద‌వాలి. త‌ల్లి ప్రాణ‌మిచ్చి..పాలిచ్చి పెంచి పోషిస్తుంది. త‌ను ప‌స్తులుండి పిల్ల‌ల‌కు పెడుతుంది. వాళ్లు ఉన్న‌తంగా ఎద‌గాల‌ని..అంద‌రికంటే పై స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటుంది. తండ్రి ఎప్పుడూ బాధ్య‌త‌ల‌ను భుజాల మీద పెట్టుకుని మోస్తూనే ఉంటాడు.

ఈ బ‌తుకు బండిని తోస్తూనే పిల్ల‌ల ఆశ‌ల‌ను బ‌తికించేందుకు త‌ను కోల్పోతూ ఉంటాడు. ఎంత‌మంది త‌మ క‌న్నీళ్ల‌ను లోలోప‌ట దాచుకుని, జీవితాల‌ను పారేసుకుని వాళ్ల ఉన్న‌తికి వీళ్లు బ‌లాయ్యోరో త‌ల్చుకుంటే బాధేస్తుంది. గ‌తాన్ని మ‌రిచి పోకండి. మ‌రింత భ‌విష్య‌త్తు మీకు
ద‌క్కాలంటే ..బాగుప‌డాలంటే పుస్త‌కాలే మీకు దిక్సూచీలుగా ఉప‌యోగ ప‌డుతాయి. మీకు అంతులేని ఆత్మ స్థ‌యిర్యాన్ని ఇవ్వ‌డంతో పాటు
బ‌తుకు యుద్ధంలో గెలిచేందుకు ఆయుధాలుగా, సాధ‌నాలుగా ఉంటాయి. ఆల‌స్యం అమృతం విషం అన్నారు పెద్ద‌లు..చిరిగిన చొక్కా అయినా
తొడుక్కోండి..కానీ ఓ మంచి పుస్త‌కాన్ని మాత్రం కొనండి. ప‌ది మందిని చ‌దించేలా చేయండి.

ఏం ఆశించి శ్రీ రామానుజాచార్యులు ఈ సంఘం కోసం ప‌నిచేశారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. అత్యాధునిక వ‌స్తువులు, సాధ‌నాలు కొంత‌మేర‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు..కానీ హృద‌యాన్నిఆవిష్క‌రించే సాధ‌నం మాత్రం పుస్త‌క‌మే. పిల్ల‌లు విక‌సించాలంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు క‌న్న‌వారు చెప్పాలి. నీతి, నిజాయితీ, అబ‌ద్ధం ఆడ‌క పోవ‌డం, పెద్ద‌వారిని గౌర‌వించేలా ..చ‌దువులో ఉన్న‌తి పొందేలా ఉండాలంటే పుస్త‌కాలే నేస్తాలు..అవే విజ్ఞానాన్ని పంచే వెలుగుదివ్వెలు.

No comment allowed please