#ChinnaJeeyar : రుణం తీర్చుకోండి..జన్మను చరితార్థం చేసుకోండి
సేవను మించిన భాగ్యం లేదు జీవితంలో
Chinna Jeeyar : మీకు మీరే ప్రత్యేకం. మీకు మీరే బ్రాండ్. వేరొకరిని అనుసరించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మీకంటూ ఓ వ్యక్తిత్వం లేనట్టే. నిజమైన వ్యక్తిత్వం ఎదుటి వారిని ప్రభావితం చేస్తుంది. వారిని ఆలోచించేలా చూస్తుంది. వ్యక్తిత్వం అంటే ఏమిటి. అది పొందాలంటే ఏమైనా డబ్బులు ఖర్చవుతాయా..కాదు ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు మనకంటే భిన్నంగా ఉంటారు. వారు ఈ సమాజం పట్ల వారికి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. చదువు కోవడం వల్లనో లేక ఇంకొకరు నేర్పితే వచ్చేది కాదు. పరిపూర్ణమైన మనస్తత్వం..వ్యక్తిత్వం కలిగిన వారిగా
రూపొందాలంటే మాత్రం గురువుల్లాగా సాధన చేయాలి.
యోగుల్లాగా శరీరాన్ని..మనసును అదుపులో ఉంచు కోవాలి. కోరికల్ని నియంత్రించు కోగలగాలి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలిగితే చాలు గొప్ప వ్యక్తిగా మారటానికి. దీనికి ఎలాంటి ఖర్చు లేదు. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన పని లేదు. వేరెవ్వరినీ దేబరించాల్సిన అవసరం లేదు. ఉన్నదల్లా సంకల్పం కావాలి. అది మన కుటుంబం నుంచే రావాలి. పిల్లలు వికసించాలన్నా..మనసును అదుపులో ఉంచు కోవాలన్నా తల్లిదండ్రులే కీలక భూమికను పోషిస్తారు. దానిని గుర్తించి మసలు కోగలిగితే చాలు ఏ సమస్య వచ్చినా సరే మీదైన బలం..మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. జ్ఞానం పుస్తకాల్లో దొరుకుతుంది. కానీ అనుభవం మనుషుల జీవితాల నుంచి లభిస్తుంది.
గొప్పవారి జీవిత చరిత్రలు ఇందుకు ఉపయోగపడుతాయి. వారిని చదవాలి. ఆకళింపు చేసుకోవాలి.వీలైతే ఆచరించేలా చూడాలి. ప్రతిరోజు శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో మీ మనసును ఎలాంటి మోహాలకు, కోరికలకు ప్రభావం కాకుండా చూసుకోవాలి. నిజమైన వ్యక్తిత్వం అంటే మాట ఇవ్వడం..ఇచ్చాక దానిని నిలబెట్టు కోవడం. సమయ పాలన పాటించడం. ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండడం. ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు వాళ్లు పైకొస్తారు. పదుగురికి వెలుగును పంచుతారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ మారండి. జన్మనిచ్చిన కన్నవారి బాధ్యతలను మీరు తీసుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది. చరితార్థమవుతుంది.

No comment allowed please