Mansukh Mandaviya : 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ (booster dose)
16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ (vaccination)
Mansukh Mandaviya : కరోనా వ్యాక్సినేషన్ (vaccination) కు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. కరోనా కాస్తా తగ్గుముఖం పట్టినా టీకా కార్యక్రమం సాగుతూనే ఉంటుందని తెలిపింది.
ఈనెల 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయసున్న చిన్నారులతో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ (booster dose) ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ ఎవాన్స్ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాలు వీరికి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ టీకాల పంపిణీకి క్లియరెన్స్ కూడా వచ్చేసింది.
ఇదే విషయాన్ని ఇవాళ అధికారికంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా (Mansukh Mandaviya) వెల్లడించారు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసు కోవాలని ఆయన సూచించారు.
ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కూడా సూచనలు అందజేశామన్నారు.
పిల్లల ఆరోగ్యానికి తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పనిలో పనిగా వృద్దుల సంరక్షణ కూడా తమదే బాధ్యత అని అంటూనే వారికి బూస్టర్ డోస్ (booster dose) ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో చోటు చేసుకుంది. ఇప్పటి దాకా 4.29 కోట్ల మందికి కరోనా సోకింది.
వీరిలో 4.24 కోట్ల మంది రికవరీ అయ్యారు.
Also Read : డియర్ కామ్రేడ్ ‘మాన్’ కంగ్రాట్స్