Rajnath Singh : స‌రిహ‌ద్దు ఉద్రిక్తం రాజ్ నాథ్ స‌మావేశం

అట్టుడుకుతున్న లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌

Rajnath Singh : మ‌రోసారి డ్రాగ‌న్ చైనా భార‌త్ తో ఢీకొనేందుకు సిద్ద‌మైంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంట డిసెంబ‌ర్ 9న భారత్, చైనా దేశాలకు చెందిన సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇరు దేశాల‌కు చెందిన సైనికులు గాయ‌ప‌డ్డారు. అనంత‌రం కాల్పుల మోత నుంచి విర‌మించుకున్నారు.

ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా భార‌త దేశానికి చెందిన అత్యున్న‌త ఆర్మీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 9న ఘ‌ట‌న జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ఎందుకు వెల్ల‌డించ‌లేద‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి.

ఈ మేర‌కు వాయిదా తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి. స‌రిహ‌ద్దు వివాదంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టాయి. ఇదిలా ఉండ‌గా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంలో దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆయ‌న నేతృత్వంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు.

త‌దుప‌రి చ‌ర్య‌లు ఏం తీసుకోవాల‌నే దానిపై ఇందులో చ‌ర్చించ‌నున్నారు రాజ్ నాథ్ సింగ్. ఈ కీల‌క అత్య‌వ‌స‌ర స‌మావేశంలో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండ‌డే, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ ఆర్ హ‌రి కుమార్ , ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రిల‌తో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ స‌మావేశం కానున్నారు.

ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింద‌ని అంగీక‌రించారు. ఇప్ప‌టికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ఇటీవ‌లే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కావాల‌ని చైనా ఇబ్బందులు పెడుతోందంటూ ఆరోపించారు.

Also Read : స‌రిహ‌ద్దు వివాదం ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!