Yogi Cabinet : ఉత్తర ప్రదేశ్ లో కొలువు తీరనున్న కేబినెట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే కేబినెట్ లో ఎవరు ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సీఎం యోగి ఆదిత్యానాథ్.
తాజాగా యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ 273 సీట్లు కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో పలువురు కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసింది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా యోగి కేబినెట్ (Yogi Cabinet )లో చోటు కల్పించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నరు.
సీఎం ఇప్పటికే మోదీతో, అమిత్ షా, జేపీ నడ్డాతో పలుమార్లు సమావేశం అయ్యారు. వరుసగా ఎంపీగా గెలుస్తూ వచ్చిన సీఎం యోగి ఆదిత్యానాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
ఆయన గోరఖ్ పూర్ సదర్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత కేబినెట్ మాదిరిగానే ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కేశవ్ మౌర్య తన పదవిని కొనసాగించే ఛాన్స్ ఉంది.
ఆయన వైపు బీజేపీ హై కమాండ్ అభ్యంతరం తెలుపలేదు. దినేశ్ శర్మ ప్లేస్ లో బ్రజేష్ పాఠక్ ఉంటారని టాక్. ఇక ప్రధాని మోదీకి సన్నిహితుడిగా పేరొందిన ఎకే శర్మ, బేబీ రాణి మౌర్య, జితిన్ ప్రసాద, అసిమ్ అరుణ్ , స్వతంత్ర దేవ్ సింగ్, దినేష్ ఖటిక్ , సందీప్ సింగ్ , అరుణ్ వాల్మికి, ఆశిష్ పటేల్ (అప్నా దళ్ పార్టీ ) , సంజయ్ నిషాద్ , దయాశంకర్ సింగ్ ఉన్నారు.
వీరితో పాటు సలీల్ విష్ణోయ్ , యోగేంద్ర ఉపాధ్యాయ, కపిల దేవ అగరవాల్ , రవీంద్ర జైస్వాల్ పేర్లు ఉన్నాయి.
Also Read : గవర్నర్ ఆరోపణలపై స్పందించిన సర్కార్