Kamal Nath : సచిన్..గెహ్లాట్ ఇద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్
స్పష్టం చేసిన మాజీ సీఎం కమల్ నాథ్
Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. తాను పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఫోకస్ పెడతానని చెప్పారు.
పనిలో పనిగా రాజస్థాన్ సీఎం పదవిని ఆశిస్తున్న సచిన్ పైలట్, సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ఇద్దరూ తనకు మంచి స్నేహితులంటూ స్పష్టం చేశారు. రాజకీయాలు అన్నాక సంక్షోభాలు సహజమేనని పేర్కొన్నారు మాజీ సీఎం. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని తాను నమ్ముతున్నట్లు తెలిపారు కమల్ నాథ్(Kamal Nath). పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదు. అయితే గెహ్లాట్ ను పార్టీ అత్యున్నత పదవిని చేపట్టేందుకు తాను సుముఖంగా ఉన్నానని చెప్పారు. ఇదే సమయంలో రాజస్థాన్ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని మరోసారి పేర్కొన్నారు కమల్ నాథ్.
తిరుగుబాటు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని సదరు ఎమ్మెల్యేలందరికీ తెలుసన్నారు. ఇప్పటికే దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రతి ఒక్కరు చూస్తున్నారని అన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే బీజేపీ గద్దలు వాలి పోయేందుకు సిద్దంగా ఉంటాయని హెచ్చరించారు కమల్ నాథ్.
ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యాక ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : రైల్వే హొటల్ కేసులో కోర్టుకు రావాల్సిందే