Botsa Satyanarayana : త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ
డీఎస్సీ వేస్తామన్న మంత్రి బొత్స
Botsa Satyanarayana : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana). పంతుళ్ల భర్తీతో పాటు ఇతర ప్రధాన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని ఈ మేరకు సీఎం జగన్ ఎడ్డి కూడా ఆమోదం తెలిపారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
త్వరలోనే విధాన పరమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పోస్టుల భర్తీ విషయంలో సీఎం క్యాలండర్ ప్రకటించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో జాబ్స్ భర్తీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు బొత్స.
ఇక టీచర్లు, ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించి పూర్తి పారదర్శకంగా ఉండేలా చూస్తామన్నారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాలలో ఎలాంటి పద్దతలు అవలంభిస్తున్నారో తెలుసుకుంటామని చెప్పారు బొత్స సత్యనారాయణ. కాగా విద్యార్థులకు రాగి జావా నిలిపి వేసినట్లు వస్తున్న ఆరోపణలు అబద్దమన్నారు.
అమరావతి రాజధాని అయితే చంద్రబాబు నాయుడు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు. విశాఖ రాజధాని కావడం ఖాయమన్నారు మంత్రి.
Also Read : పేపర్ లీకేజీలో మరో ఇద్దరు అరెస్ట్