Botsa Satyanarayana : ప‌వ‌న్ కు పాఠాలు అవ‌స‌రం – బొత్స

నీ స‌వాల్ కు నా జ‌వాబు ఇదిగో

Botsa Satyanarayana : ఏపీలో విద్యార్థుల‌కు ట్యాబ్ లు స‌రే మ‌రుగుదొడ్ల మాటేంటి అంటూ జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ స‌ర్కార్ ను నిల‌దీశారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ(Botsa Satyanarayana) తీవ్రంగా స్పందించారు. ముంద‌స్తు స‌మాచారం తెలుసు కోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం మానుకోవాల‌ని సూచించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు బొత్స‌.

Botsa Satyanarayana Said

అర్థం కాక పోతే పాఠాలు చెప్పేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని, మ‌రి హొం వ‌ర్క్ చేసేందుకు నువ్వు సిద్దంగా ఉన్నావా అంటూ ప్ర‌శ్నించారు. నువ్వు అడిగిన లేదా నిల‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇదిగో అంటూ స్ప‌ష్టం చేశారు విద్యా శాఖ మంత్రి.

ప‌బ్లిక్ ప్రొక్యూర్ మెంట్ టెండ‌ర్లకు సంబంధించినంత వ‌ర‌కు అర్హ‌త లేదా ప‌రిధిని నిర్ణ‌యించే అధికారాన్ని ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని పేర్కొన్నారు. రూ. 100 కోట్ల‌కు పైబ‌డిన ఏదైనా ప్ర‌భుత్వ టెండ‌ర్ ప‌రిధిని , అర్హ‌త‌ను ఖ‌రారు చేయ‌డం హైకోర్టు స‌మ్మ‌తితో నియ‌మించ‌బ‌డిన ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శివ శంక‌ర్ రావుతో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇక టెండ‌ర్ స్పెసిఫికేష‌న్ల‌కు సంబంధించి అన్ని వివ‌రాల‌ను ప‌బ్లిక్ డొమైన్ లో ఉంచ‌బ‌డ‌తాయి. కంపెనీలకు 21 రోజుల స‌మ‌యం ఇవ్వ‌డం జ‌రుగుతుంది. దీన్ని పోస్ట్ చేసిన న్యాయ‌మూర్తి కాల్ తీసుకుంటారు..టెండ‌ర్ స్పెసిఫికేష‌న్లు లాక్ చేయ‌బ‌డ‌తాయ‌ని పేర్కొన్నారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

న్యాయ‌ప‌ర‌మైన ప్రివ్యూను క‌లిగి ఉన్న ప్ర‌పంచం లోని ఏకైక స‌ర్కార్ త‌మ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి గూగుల్ లో మీరు ఈ  లింక్ ను క్లిక్ చేస్తే Click Here పూర్తి వివ‌రాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు మీరు చేసే ప్ర‌తి ప్ర‌య‌త్నానికి సిగ్గుప‌డాల‌ని అన్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

Also Read : BK Hari Prasad CM : సిద్ద‌రామ‌య్య‌పై సీనియ‌ర్ నేత గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!