Vijender Singh : మీసాలు తిప్పిన రాహుల్..బాక్సర్
రాహుల్ యాత్రలో బాక్సర్ విజేందర్ సింగ్
Vijender Singh : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కంటిన్యూగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రాలలో యాత్ర పూర్తయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్(Vijender Singh) రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రాహుల్ , విజేందర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ తో పాటు బాక్సర్ మీసాలు తిప్పడం యాత్రలో హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే సోదరి ప్రియాంక గాంధీ కూడా సోదరుడు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. మరో వైపు సచిన్ పైలట్ కూడా భాగం పంచుకున్నారు.
ఇదిలా ఉండగా విజేందర్ సింగ్(Vijender Singh) కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు గతంలో. పార్టీ అగ్ర నాయకుడితో మాట్లాడుతూ నడవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా చిన్నారుల నుంచి పెద్దల దాకా అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రకు ఆదరణ లభిస్తోంది.
కాగా విజేందర్ సింగ్ ఒలింపిక్స్ పోటీల్లో బాక్సర్ విభాగంలో విజేతగా నిలిచాడు. రాహుల్ గాంధీతో కలిసి శుక్రవారం కొన్ని కిలోమీటర్లు నడిచారు. హర్యానా లోనీ భివానీ జిల్లాకు చెందిన విజేందర్ సింగ్ గత లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు.
2008లో బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం పొందాడు.
Also Read : కమల వికాసం ‘ఇమ్నా’ ప్రత్యేకం
Olympic medalist Boxer Vijender Singh joins Sh. @RahulGandhi Ji in the #BharatJodoYatra today. pic.twitter.com/ziSJC9IkMk
— Nitin Agarwal (@nitinagarwalINC) November 25, 2022