Pritam Singh Lodhi : మతం పేరుతో బ్రాహ్మణులు మోసం
బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్..వేటు
Pritam Singh Lodhi : మధ్య ప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి అనుంగు అనుచరుడిగా పేరొందిన ప్రీతం సింగ్ లోధీ సీరియస్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాషాయ దళంలో కలకలం రేపాయి.
ప్రధానంగా లోధి బ్రాహ్మణులను టార్గెట్ చేశాడు. బ్రాహ్మణుల వల్లే సమస్యలు నెలకొన్నాయని, వారి చేతుల్లోనే పార్టీ ఉందని, మిగతా కులాల వారికి ఎలాంటి ప్రయారిటీ లేకుండా పోయిందని ఆరోపించారు.
ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతం సింగ్ లోధీ(Pritam Singh Lodhi). బ్రాహ్మణులు మతాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని , ప్రజలను మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు బీజేపీ నాయకుడు.
ప్రజలు సంపాదించిన డబ్బులను, వనరులను , అవకాశాలను బ్రాహ్మణులు ఉపయోగించు కుంటున్నారంటూ ధ్వజమెత్తారు. పవర్ కూడా వారి చేతుల్లోనే ఉందని మండిపడ్డారు లోధీ.
లెక్కలేనంత సంపద కూడబెబ్టుకుని కరోడ్ పతులుగా మారారని , రాజకీయ నేతలు సైతం వారి కాళ్లకు మొక్కడం వల్లే ఇదంతా జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక బ్రాహ్ముణులతో పాటు మహిళల పట్ల కూడా కించ పరిచేలా మాట్లాడడంతో తీవ్ర రాద్ధాంతం చెలరేగింది మధ్యప్రదేశ్ బీజేపీలో. ఇదిలా ఉండగా ప్రీతం సింగ్ లోధీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాషాయ పార్టీ వేటు వేసింది.
పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ప్రీతం సింగ్ లోధి చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లోధి పిచ్చోర్ స్థానం నుంచి 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ