KCR CM : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. మొత్తం 91 వేల 400 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఇందులో 11 వేల కాంట్రాక్టు జాబ్స్ పోను 80 వేల 39 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. నిన్న వనపర్తి వేదికగా జరిగిన బహిరంగ సభలో ఇవాళ కీలక ప్రకటన చేస్తానని నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు.
ఇవాళ ఆయన చెప్పినట్లుగానే జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. తమది ఎంప్లాయిమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. అత్యధిక జీతాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
ఆయా శాఖల వారీగా స్వయంగా కేసీఆర్ జాబ్స్ ప్రకటించారు. గ్రూప్ -1 పోస్టులు 503 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రూప్ -2లో 582, గ్రూప్ -3లో 1, 373 పోస్టులు, గ్రూప్ -4 లో 9 వేల 168 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.
జిల్లా స్థాయిలో 39 వేల 829 పోస్టులు, జోనల్ లెవల్ లో 18 వేల 866 పోస్టులు, మల్టీ జోనల్ లో 13 వేల 170 పోస్టులు జాబ్స్ ఉన్నాయని చెప్పారు కేసీఆర్. ఇతర కేటగిరీ, వర్శిటీలలో 8 వేల 174 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
ఇక నుంచి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు కేసీఆర్(KCR CM). ఈరోజు నుంచే ఆయా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తారని తెలిపారు.
ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేయాలని సిఎం ఆదేశించారు. గరిష్ట వయో పరిమితి 10 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి వివిధి కారణాల రీత్యా నోటిఫికేషన్లు ఇవ్వ లేదన్నారు.
Also Read : వచ్చే విద్యా సంవత్సరం అంతా ఆంగ్లం