Brijesh Kalappa : కాంగ్రెస్ కు బ్రిజేష్ కాల‌ప్ప గుడ్ బై

నిన్న మ‌హారాష్ట్ర నేడు క‌ర్ణాట‌క

Brijesh Kalappa : కాంగ్రెస్ మునిగి పోతున్న ప‌డ‌వ అని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్. రాజ్య‌స‌భ సీట్ల ఎంపిక ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. మ‌రాఠా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆశిష్ దేశ్ ముఖ్ గుడ్ బై చెప్పారు.

తాజాగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బ్రిజేష్ కాల‌ప్ప రాజీనామా చేశారు. త‌న‌కు పార్టీ ప‌రంగా గుర్తింపు లేకుండా పోయింద‌న్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం ప‌ని చేయాల‌నే ఆస‌క్తిని తాను కోల్పోయాన‌ని చెప్పారు.

ఈ మేర‌కు అర‌వింద్ కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ‌. కాళ‌ప్ప(Brijesh Kalappa) సుప్రీంకోర్టులో న్యాయ‌వాదిగా ఉన్నారు.

ఆయ‌న‌కు మంచి లాయ‌ర్ గా పేరొందారు. 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి స‌మ‌ర్పించిన రాజీనామా లేఖ‌లో అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

పార్టీ ప‌రంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ వ‌చ్చాను. తాను 2013లో యూపీఏ సంవ‌త్స‌రాల నుండి హిందీ, ఇంగ్లీష్ , క‌న్న‌డ ఛాన‌ళ్ల‌లో పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించాన‌ని తెలిపారు.

ఒక ద‌శాబ్దం పాటు 6, 497 డిబేట్ ల‌లో పాల్గొన్న‌ట్లు తెలిపారు బ్రిజేష్ కాళ‌ప్ప‌. పార్టీ త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాన‌ని చెప్పారు.

కానీ త‌న‌ను పార్టీ ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. దీంతో 25 ఏళ్ల అనుబంధాన్ని ఆయ‌న తెంచుకున్నారు.
అంత‌కు ముందు మాజీ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప కామెంట్స్ ను త‌ప్పు ప‌ట్టారు బ్రిజేష్ కాళ‌ప్ప‌(Brijesh Kalappa).

Also Read : కాంగ్రెస్ లోకి వెళితే మునగ‌డం ఖాయం – పీకే

Leave A Reply

Your Email Id will not be published!