Rishi Sunak : బ్రిటన్ కు పూర్వ వైభవం తీసుకు వస్తా – రిషి సునక్
ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి ప్రసంగం
Rishi Sunak : యావత్ దేశం నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. బ్రిటన్ కోల్పోయిన వైభవాన్ని తీసుకు రావడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు కొత్తగా ప్రధానమంత్రిగా కొలువు తీరిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్(Rishi Sunak). మంగళవారం కింగ్ చార్లెస్ ను కలుసుకున్నారు.
అనంతరం యుకె పీఎంగా తప్పుకున్నారు లిజ్ ట్రస్. ఈ సందర్భంగా ఆమెకు వీడ్కోలు పలికారు. అనంతరం జాతిని ఉద్దేశించి రిషి సునక్ ప్రసంగించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ బ్రిటన్ వైపు చూస్తున్నారన్నది వాస్తవం. ప్రస్తుతం నాపై ఎంతో ఎంతో బాధ్యత ఉందన్నది వాస్తవం.
ఒక రకంగా నా కెరీర్ లో ఇది అత్యున్నత పదవి. అంతే కాదు నాకు ఈ బాధ్యత పెను సవాల్ లాంటిదని చెప్పారు. కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు రిషి సునక్(Rishi Sunak). ఇందుకు సంబంధించి నేను ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇది పూర్తిగా ఒక్కరి వల్ల కాదు. అందరికీ సమిష్టి బాధ్యత ఉంది. మన ముందున్న ప్రధాన సవాల్. ఆర్థికంగా మరింత పటిష్టం కావడం. దీనిపైనే మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రిషి సునక్. ప్రస్తుతం మన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ లో పుతిన్ యుద్దం ప్రపంచ మార్కెట్ ను అస్థిర పరిచింది.
ఈ సమయంలో లిజ్ ట్రస్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదన్నారు రిషి సునక్. ఏది ఏమైనా మనం ఆశాభావంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు బ్రిటన్ ప్రధానమంత్రి.
Also Read : ప్రధానిగా రిషి విజయం సాధించాలి – లిజ్ ట్రస్