BL Santosh Poster : బీఎల్ సంతోష్ కనబడటం లేదు
భారత రాష్ట్ర సమితి పోస్టర్ కలకలం
BL Santosh Poster : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి మధ్య నిన్నటి దాకా మాటల యుద్దం కొనసాగితే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం తెర పైకి రావడంతో పోస్టర్ల వార్ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే మార్చి 11న ఈడీ ముందు విచారణకు హాజరైంది.
ఉదయం 11 గంటలకు వెళ్లి రాత్రి 8.05 తిరిగి వచ్చారు. తొమ్మిది గంటల పాటు విచారణ ఎదుర్కొంది. మార్చి 16న గురువారం మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది.
ఆమెను విచారించే కంటే ముందు బీఆర్ఎస్ , బీజేపీ పోస్టర్ వార్ మరింత వేడెక్కింది. హైదరాబాద్ లో రెండు వేర్వేరు చోట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(BL Santosh Poster) ఫోటోతో పోస్టర్లు ఏర్పాటు చేసింది భారత రాష్ట్ర సమితి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్ గత కొంత కాలం నుంచి కనిపించడం లేదంటూ పేర్కొన్నారు ఈ పోస్టర్ లో.
ప్రస్తుతం ఈ పోస్టర్ కలకలం రేపుతోంది. ఇందుకు అందమైన క్యాప్షన్ కూడా జతపర్చారు. ఎమ్మెల్యే వేటలో ప్రతిభావంతుడు ఈ బీఎల్ సంతోష్ అంటూ పేర్కొనడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్విట్టర్ లో బీఎల్ సంతోష్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారతీయ జనతా పార్టీ.
Also Read : కవితపై థర్డ్ డిగ్రీ నిజమేనా