BRS-BSP: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం !

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం !

BRS-BSP: రానున్న లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 ఎంపీ సీట్లను కేటాయిస్తూ బీఆర్ఎస్(BRS) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ స్థానాలను బీఎస్పీకు కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించింది. దీనితో నాగర్‌ కర్నూల్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణాలో మొత్తం 17 లోక్‌ సభ స్థానాలు ఉండగా… బీఎస్పీకి 2 కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల బీఆర్ఎస్ పోటీ చేయనుంది. బీఆర్ఎస్ పోటీ చేయనున్న 15 పార్లమెంట్ స్థానాలకు గాను ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.

BRS-BSP – 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే !

1) ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు

2) మహబూబాబాద్ -(ఎస్టీ)మాలోత్ కవిత

3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్

4) పెద్దపల్లి(ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్

5) మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి

6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్

7) వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య

8) జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ .

9) నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్

Also Read : Minister Ponnam : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగిన పొన్నం

Leave A Reply

Your Email Id will not be published!