YS Sharmila : బీఆర్ఎస్ కాదు బందిపోట్ల రాష్ట్ర సమితి
ఆ పార్టీలో నేతలు లేరు గూండాలున్నారు
YS Sharmila : వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన కామెంట్స్ చేశారు. తన వాహనాలపై దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తాను ప్రజా ప్రస్థానం పేరుతో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. అయినా కావాలని తమపై కక్షకట్టి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమపై దాడులకు దిగారని ఆరోపించారు.
సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో బస్సుపై దాడికి దిగి, దగ్ధం చేశారు. తమ పార్టీకి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించారని, ఆపై తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై భౌతికంగా దాడికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
ధ్వంసమైన కారుతోనే మంగళవారం సీఎం కేసీఆర్ కొలువు తీరిన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను రూల్స్ ప్రకారమే పాదయాత్ర చేపట్టానని అన్నారు. కానీ టీఆర్ఎస్ లో నాయకులు, కార్యకర్తలు లేరని కేవలం గూండాలు మాత్రమే ఉన్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల.
భారత రాష్ట్ర సమితి కాదని అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరి కొని తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం వైఎస్ షర్మిలను(YS Sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్టీపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : ఖాకీలు..గులాబీ నేతలు గూండాలు – షర్మిల