BRS Joinings : కాంగ్రెస్ కు షాక్ బీఆర్ఎస్ కు జంప్
కేసీఆర్ సమక్షంలో సంభాని..మానవతా రాయ్
BRS Join : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి, తుమ్మల వర్గాలకు ఇది ఊహించని పరిణామం.
BRS Join Viral
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన నివాసంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ , టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన , విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన మానవతా రాయ్ , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ నాయకుడు అబ్బయ్య, డాక్టర్ రామచంద్రు నాయక్ , తదితరులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్బంగా కేసీఆర్ వారిని పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మీ అందరికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా బరిలో నిలిచిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సూచించారు. తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు కేసీఆర్.
Also Read : Minister KTR : ఆ ముగ్గురి పతనం ఖాయం