MLA Harish Rao : మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హౌస్ అరెస్ట్
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు...
MLA Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నేరు హరీష్ రావు(MLA Harish Rao)ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిన్న (గురువారం) ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోకాపేటలోని హరీష్ రావు(MLA Harish Rao) నివాసంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను కలవడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను ఎవరినీ అనుమతించడం లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ నివాసానికి బయలుదేరిన మల్లారెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు.
MLA Harish Rao House Arrest
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. కరీంనగర్ నగర అధ్యక్షుడు హరిశంకర్, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ భర్త సురేష్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రవీణ్‌లను అరెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : MP Purandeswari : వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎంపీ