BRS Meeting : కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లి లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిణామాలు జరిగినా భయపడలేదన్నారు...

BRS : ఈరోజు (మంగళవారం) ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అలికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కేసీఆర్‌ను కలిశారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. పార్టీలో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడవద్దని సూచించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

BRS Meeting..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిణామాలు జరిగినా భయపడలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు వస్తాయని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ పార్టీ మారడమే కాకుండా నష్టపోవద్దని చెప్పారు.రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.

Also Read : Minister Nara Lokesh : 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!