BRS MPs Protest : ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీల నిరసన
మహిళా బిల్లు..ఓబీసీ బిల్లు కోసం
BRS MPs Protest : న్యూఢిల్లీ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సోమవారం న్యూఢిల్లీ వేదికగా ఆందోళన బాట పట్టారు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా మహిళా బిల్లు , ఓబీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించక పోవడం దారుణమన్నారు. ఇకనైనా మోదీ కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు.
BRS MPs Protest & Elections
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలలో మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని, మోదీ పదేపదే బడుగుల జపం చేస్తారని కానీ ఆచరణలోకి వచ్చేసరికి దానిని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎంపీలు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనైనా వెంటనే మహిళా, ఓబీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. లేక పోతే తాము ప్రత్యక్షంగా మున్ముందు ఆందోళన , నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Also Read : Mallikarjun Kharge : పేర్లు మారిస్తే దేశం బాగుపడుతుందా