BRS Win : హైదరాబాద్ – త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో మరోసారి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి పవర్ లోకి రాబోతోందని ప్రముఖ సర్వే సంస్థ సీఎస్డీఎస్ స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు పక్కా ఆధారాలతో సహా వివరించారు సంస్థ ప్రతినిధులు. ఈ విషయంపై ప్రముఖ జాతీయ స్థాయి ఛానల్ లో చర్చించారు.
భారత దేశంలో అత్యున్నతమైన సెఫాలజిస్టులుగా పేరు పొందారు సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ . ఈ సందర్బంగా ఆయన చర్చల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాబోతోందని కుండ బద్దలు కొట్టారు.
BRS Win Commented by CSDS
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు బలంగా లేక పోవడం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన రైతులు, ఇతర వర్గాలకు చేరుతున్నాయని ఇవే కేసీఆర్ కు బలంగా మారబోతున్నాయని స్పష్టం చేశారు.
ఓటు షేరింగ్ శాతంలో కొంత అటు ఇటుగా వచ్చినా గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని కూడా బీఆర్ఎస్(BRS) సాధిస్తుందని తెలిపారు. మరో వైపు ఇదే చర్చలో పాల్గొన్న లోక్ నీతి నేషనల్ కోఆర్డినేటర్ సందీప్ శాస్త్రి సైతం బీఆర్ఎస్ రాబోతోందని చెప్పడం విశేషం.
Also Read : MLA Seethakka : సీడీఎఫ్ నిధుల కోసం కోర్టుకు