BS Yediyurappa Comment : యెడ్డీ బీజేపీని ర‌క్షిస్తారా గ‌ట్టెక్కిస్తారా

అంద‌రి క‌ళ్లు క‌ర్నాట‌క రాజ‌కీయాల పైనే

BS Yediyurappa Comment :  క‌న్న‌డ‌ రాజకీయ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ కలిగి ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు బీఎస్ యెడియూర‌ప్ప భార‌తీయ జ‌న‌తా పార్టీలో. అడ్ర‌స్ లేకుండా పోయిన కాషాయానికి కొత్త సొబ‌గులు తీసుకు వ‌చ్చాడు.

క‌ర్ణాట‌క లో బ‌ల‌మైన వ‌ర్గంగా పేరొందిన లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ద‌క్షిణాదిన ఏ పార్టీ అయినా కొలువు తీరాలంటే, అధికారంలోకి రావాలంటే లింగాయ‌త్ లను ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందే.

రాష్ట్రంలో ఎవ‌రిని అడిగినా బీజేపీ అంటేనే యెడియూర‌ప్ప‌(BS Yediyurappa). ఆయ‌న‌ను అంతా ఆప్యాయంగా యెడ్డీ అని పిలుచుకుంటారు. అంత‌లా ఆయ‌న అల్లుకు పోయారు. క‌న్న‌డ‌వాసుల‌కు త‌న రాజ‌కీయ నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో పేరు తీసుకు వ‌చ్చారు.

అంచెలంచెలుగా ఎదిగారు. త‌ను ఎద‌గ‌డ‌మే కాదు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేస్తూ వ‌చ్చారు. కీల‌క‌మైన నేత‌గా చెలామ‌ణి అవుతూ వ‌చ్చారు. రామ‌కృష్ణ హెగ్డే, బొమ్మై , సిద్ద‌రామ‌య్య లాంటి ఎంద‌రో ఉద్దండుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చారు.

ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. ప‌లుసార్లు ప‌ద‌విలో ఉన్నా విచిత్రం ఏమిటంటే యెడియూర‌ప్ప పూర్తి కాలం ముఖ్య‌మంత్రిగా ఉండ‌లేక పోయారు.

బీజేపీ హైక‌మాండ్ ఒత్తిళ్ల మేర‌కు అవినీతి, ఆరోప‌ణ‌లు రావడంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో యెడ్డీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.కానీ 

అత‌డి నుంచి పార్టీని వేరు చేయ‌లేక పోయింది. ఎంత‌లా అంటే యెడ్డీ అంటేనే బీజేపీ. ఆయ‌న లేకుండా కాషాయ పార్టీని ఊహించ లేం. ఆయ‌న 

త‌ప్పుకోవ‌డంతో వేరే వ్య‌క్తిని సీఎంగా నియ‌మించేందుకు సాహించ లేక పోయింది అధిష్టానం.

కార‌ణం లింగాయ‌త్ సామాజిక వ‌ర్గం డామినేట్ చేయ‌డ‌మే. చివ‌ర‌కు యెడ్డీ అనుచ‌రుడిగా పేరొందిన బ‌స్వ‌రాజ్ బొమ్మైని సీఎంగా చాన్స్ ఇచ్చింది.

ఆయ‌న‌కు సౌమ్యుడ‌న్న పేరుంది.

ఈ త‌రుణంలో క‌ర్ణాట‌క‌లో అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం, ఆయ‌న ప‌నితీరుపై స్వంత పార్టీకి చెందిన వారే సంతృప్తి లేక పోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింది.

త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో అభ్య‌ర్థిని మారిస్తే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంద‌నే భ‌యంతో యెడ్డీకి అధిక ప్రాధాన్య‌త ఇచ్చింది.

ఇక పార్టీని గ‌ట్టెక్కించే బాధ్య‌త‌ను మ‌రోసారి ఆయ‌న‌కే అప్ప‌గించింది. రాజ‌కీయాల్లో మేరున‌గ ధీరుడిగా, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందారు బీఎస్ 

యెడియూర‌ప్ప‌. మ‌రి ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బీజేపీని గట్టెక్కిస్తారా లేక ర‌క్షిస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : బీజేపీ వ్యూహం యెడ్డీకి సార‌థ్యం

Leave A Reply

Your Email Id will not be published!