BS Yediyurappa : శివ‌మొగ్గ ఎయిర్ పోర్ట్ కు నా పేరొద్దు 

మాజీ సీఎం బీఎస్ యెడియూర‌ప్ప 

BS Yediyurappa : క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శివ మొగ్గ విమానాశ్రయానికి త‌న పేరు పెట్టాల‌నే నిర్ణ‌యాన్ని పునః ప‌రిశీలించాల‌ని సూచించారు.

ఈ విష‌యంపై ఆలోచించాల‌ని సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మైని కోరారు. తాను సామాన్యుడిన‌ని, రాష్ట్రంలో పేరొందిన ప్ర‌ముఖులు, స్వాములు, గురువులు, మ‌హానుభావులు ఎంద‌రో ఉన్నార‌ని అన్నారు.

త‌న పేరు వ‌ద్ద‌ని , ప్ర‌ముఖ‌ల పేర్లు పెట్టాల‌ని బీఎస్ య‌డియూర‌ప్ప(BS Yediyurappa) క‌ర్ణాట‌క స‌ర్కార్ ను అభ్య‌ర్థించారు. ఇదిలా ఉండ‌గా ఈనెల 20న శివ‌మొగ్గ లోని సోగానే వ‌ద్ద కొన‌సాగుతున్న విమానాశ్ర‌య ప‌నుల‌ను ప‌రిశీలించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప పేరు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యం గురించి భార‌త ప్ర‌భుత్వ పౌర విమానాయ‌న మంత్రిత్వ శాఖ‌కు ప్ర‌తిపాద‌న పంపుతామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు య‌డ్యూర‌ప్ప ఈనెల 24న సీఎం బొమ్మైకి లేఖ రాశారు. శివ‌మొగ్గ ఎయిర్ పోర్ట్ కు త‌న పేరు పెట్ట‌డం త‌న‌ను బాధ క‌లిగించింద‌ని పేర్కొన్నారు యెడ్డి. రాష్ట్రానికి చెందిన ఏ ప్ర‌ముఖుడి పేరు పెట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ట్లు తెలిపారు.

ఇది వారి స‌హ‌కారానికి త‌గిన రీతిలో నివాళి అర్పించిన‌ట్లు  అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు యెడియూర‌ప్ప‌(BS Yediyurappa). ఇదిలా ఉండ‌గా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి.

రాష్ట్రంలో ఎంతో మంది ఉండ‌గా మాజీ సీఎం పేరు ఎందుకు పెట్టాల‌ని అనుకుంటున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.  ఇదిలా ఉండ‌గా శివ‌మొగ్గ రాజ‌కీయ స్థావ‌రం.ఆయ‌న జిల్లాలోని షికారిపుర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

పెద్ద కుమారుడు బీవై రాఘ‌వేంద్ర శివ‌మొగ్గ ఎంపీ గా గెలుపొందారు.

Also Read : మై డియ‌ర్ ఫ్రెండ్ మాక్రాన్ కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!