MLA Abbas Ansari ED : ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ అరెస్ట్ – ఈడీ

మ‌నీ లాండ‌రింగ్ కేసులో కీల‌క ప‌రిణామం

MLA Abbas Ansari ED : దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దూకుడు పెంచాయి. ప్ర‌ధానంగా ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ దుమ్ము రేపుతున్నాయి. తాజాగా మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే జార్ఖండ్ సీఎంకు స‌మ‌న్లు జారీ చేసింది ఈడీ. ఈ త‌రుణంలో మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి గ్యాంగ్ స్ట‌ర్ , పొలిటిక‌ల్ లీడ‌ర్ ముఖ్తార్ అన్సారీ కొడుకు 30 ఏళ్ల అబ్సాస్ అన్సారీని(MLA Abbas Ansari ED) అరెస్ట్ చేసింది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ‌ర్ రాజ్ ఫెడ‌ర‌ల్ ఏజెన్సీ ఆఫీసులో సుదీర్ఘ ప్ర‌శ్నోత్త‌రాల త‌ర్వాత అన్సారీని అదుపులోకి తీసుకుంది. ఇక యూపీలో యోగి ఆదిత్యానాథ్ సార‌థ్యంలో బీజేపీ స‌ర్కార్ కొలువు తీరాక సీన్ మారింది. గ్యాంగ్ స్ట‌ర్లు, నేర‌గాళ్లకు చెక్ పెట్ట‌డం ప్రారంభ‌మైంది. కొంత‌మంది నేర‌స్థులైతే తాము స్వ‌చ్చందంగా లొంగి పోతామంటూ ప్ర‌క‌టించ‌డం విశేషం.

గ‌త నెల‌లో ముఖ్తార్ అన్సారీకి చెందిన రూ. 1.48 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన రాజ‌కీయ నాయ‌కుడు ముక్థార్ అన్సారీ కుమారుడు మౌలోని సుహెల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ శనివారం అరెస్ట్ చేసింది.

ఈమేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో అత‌ని తండ్రి, కుటుంబీకుల‌పై విచార‌ణ జ‌రుగుతున్నందున అరెస్ట్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్య‌రు ముఖ్తార్ అన్సారీ. ప్ర‌స్తుతం యూపీలోని బండా జైలులో ఉన్నారు.

ఢిల్లీలోని అన్సారీ సోద‌రుడు ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీ అధికారిక నివాసంతో పాటు ఘాజీపూర్ , మ‌హ్మ‌దాబాద్ , మౌ, ల‌క్నో లోని కొన్ని ప్రాంతాల్లో ఈడీ దాడులు చేప‌ట్టింది.

Also Read : రాహుల్ యాత్ర‌కు జ‌న నీరాజ‌నం – జైరాం

Leave A Reply

Your Email Id will not be published!