BSP Resign : బీఎస్పీ చీఫ్ ఆర్సీపీకి బిగ్ షాక్
సూర్యాపేటలో మూకుమ్మడి రాజీనామా
BSP Resign : సూర్యాపేట జిల్లా – బహుజన సమాజ్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీఎస్పీకి ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది. సూర్యాపేట జిల్లా బీఎస్పీకి చెందిన నేతలు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇది ఒక రకంగా ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విస్తు పోయేలా చేసింది.
BSP Resign Viral
దివంగత గ్యాంగ్ స్టర్ నయీం రేంజ్ లో అరాచకాలకు పాల్పడుతూ వస్తున్న జానయ్యకు ఆర్ఎస్పీ బహిరంగంగా మద్దతు పలకడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఓ వైపు ప్రజల కోసం పని చేస్తున్నానంటూ బీరాలు పలుకుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఇలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నించారు.
పూర్తిగా అవినీతి, అక్రమాలకు , దౌర్జన్యాలకు పాల్పడుతున్న జానయ్యను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని నిలదీశారు. బీఎస్పీలో చేర్చుకుని పార్టీ పరువును తీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నారు వట్టే జానయ్య యాదవ్. ఆయన సతీమణి వట్టే రేణుక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి భార్యా, భర్తలపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆరోపించారు.
Also Read : Pawan Kalyan : జగన్ పిల్ల వేషాలు ఇక చెల్లవు