Buggana : (AP assembly) (TDP members) అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana ). సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాము వివరణ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని కానీ వారికి వినే ఓపిక లేక పోవడం దారుణమన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. సభా మర్యాదలు పాటించకుండా అడ్డుకోవడం ఇది ఏ సంస్కారమని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
ఇప్పటి దాకా లక్షా 30 వేల కోట్ల రూపాయలను నేరుగా పేదలకు వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత ఒక్క ఏపీకే ఉందన్నారు. దీనిని గుర్తించకుండా సభను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు బుగ్గన (Rajendra Nath Reddy) (Buggana ).
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే (TDP members) అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ పలుమార్లు కూర్చోవాలని, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని సూచించారు.
కానీ (TDP members) పట్టించు కోలేదు. పదే పదే అడ్డు తగిలేందుకు ప్రయత్నం చేశారు. దీంతో విప్ శ్రీకాంత్ రెడ్డి సభ్యుల ప్రవర్తన పై కొత్త రూలింగ్ ప్రవేశ పెట్టారు. వైట్, రెడ్, గ్రీన్ లైన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
దీనికి సభ పూర్తిగా ఆమోదం తెలిపింది. ఈ లైన్స్ గనుక దాటితే సభ్యులు ఆటోమెటిక్ గా సస్పెన్షన్ కు గురవుతారు. కాగా సభను హుందాగా నడిపేందుకే ఈ ప్రతిపాదన తీసుకు రావడాన్ని సభ్యులు ముక్త కంఠంతో ఓకే చెప్పారు. దీనికి స్పీకర్ ఆమోదం తెలిపారు.
Also Read : ఆ మరణాలన్నీ సహజమా? మరీ 18 మంది ఒకే తరహాలో..