Buggana Rajendranath Reddy : ఏపీ సర్కార్ పనితీరు సూపర్
కేంద్రం ప్రశంసించిందన్న బుగ్గన
Buggana Rajendranath Reddy : అమరావతి – కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. గత ఏడాది కంటే మెరుగైన ఆర్థిక ప్రగతి కనబరిచిందని తెలిపారు. 2023-24 ఏడాది రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకుందన్నారు. ఎమ్ఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని ఆదేశించారు ఆర్థిక మంత్రి. పీఎం ముంద్ర, స్టాండప్ ఇండియాపై బ్యాంకర్లు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
Buggana Rajendranath Reddy Comment
అర్హులైన పేదలకు సులభంగా రుణాలు ఇచ్చేందుకు చొరవ చూపాలని సూచించారు. బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గత ఏడాది రూ. 1.40 లక్షల కోట్లు ఉందని కానీ ఈసారి 20 శాతం ఎక్కువగా అంటే రూ. 1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. ఈ సందర్బంగా ప్రభుత్వ, బ్యాంకింగ్ అధికారులను అభినందించారు.
ఏపీ సర్కార్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మెరుగ్గా ఉందంటూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాద్ మెచ్చుకున్నారని ఈ సందర్బంగా బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వెల్లడించారు.
Also Read : AP CM YS Jagan : బాధితులకు జగన్ భరోసా
