Buggana Rajendranath Reddy : తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నీ అబద్దాలే ఉన్నాయంటూ నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. రూ. 48 వేల కోట్ల ఆర్థిక నేరాలు జరిగాయంటూ ఆరోపించారు.
ఎలాంటి ఫైనాన్స్ ఎమర్జెన్సీ లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కొలువు తీరాక ప్రతిదీ పారదర్శకంగా నిర్వహిస్తూ వచ్చామని చెప్పారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ తప్పుగా జరిగే పరిస్థితి లేదన్నారు.
ఇందులో వేల కోట్ల ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుందని ప్రశ్నించారు. అయితే సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దేందుకు సమయం పడుతుందన్నారు. రూ. 48 వేల 509 కోట్లు స్పెషల్ బిల్లుల రూపంలో ఉన్నాయని వెల్లడించారు.
పదిహేను అంశాల వారీగా ప్రతి దానికీ పద్దు అనేది ఉందన్నారు. నిధులు దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. అంశాల వారీగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు నివేదిక ఇచ్చామని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy )తెలిపారు.
ఎలాంటి అవగాహన లేకుండా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చోటు చేసుకున్న బుక్ అడ్జెస్ట్ మెంట్స్ ఉన్నాయని తెలిపారు ఏపీ మంత్రి.
సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను టీడీపీ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిందని ఆరోపించారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే ఐఏఎస్ అధికారిని సిఇఓగా నియమించడం జరిగిందని చెప్పారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మాజీ ఆర్థిక మంత్రి యనమలకు సూచించారు.
Also Read : ఉగాదిన కొత్త జిల్లాలకు ముహూర్తం