Shaheen Bagh : ఢిల్లీలో బుల్ డోజ‌ర్ల క‌ల‌క‌లం

ఆప్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న

Shaheen Bagh : ఢిల్లీలో బుల్ డోజర్లు మ‌ళ్లీ వ‌చ్చాయి. ద‌క్షిణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎస్డీఎంసీ) సోమవారం ఢిల్లీ పోలీసు సిబ్బంది సహాయంతో ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌తిరేక డ్రైవ్ ను ప్రారంభించింది.

దాంతో ద‌క్షిణ ఢిల్లీలోని షాహీన్ బాబ్(Shaheen Bagh) ప్రాంత నివాసితులు నిర‌స‌న తెలిపారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత కోసం తీసుకు వ‌చ్చిన బుల్ డోజ‌ర్ల‌ను స్థానికులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసుల‌కు, స్థానికుల‌కు, కార్పొరేష‌న్ సిబ్బందికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బుల్ డోజ‌ర్ల‌ను ప్ర‌యోగించ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ష‌హీన్ బాగ్ స‌మీపంలోని కాళింది కుంజ్, జామియా న‌గ‌ర్ ప్రాంతంలో , శ్రీ‌నివాస‌పురిలో పౌర సంఘాలు బుల్ డోజ‌ర్ల ప్ర‌యోగాన్ని అడ్డుకునే ప్రయ‌త్నం చేశారు.

బాధితుల‌కు ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్ర‌శ్నించారు. దీనిని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు.

సుప్రీంకోర్టు నిలిపి వేయాలంటూ ఉత్త‌ర్వులు ఇచ్చినా ప‌ట్టించు కోలేదు. చివ‌ర‌కు ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ ను సీపీఎం సీనియ‌ర్ నాయ‌కురాలు బృందా కార‌త్ తీసుకు వెళ్లి స్వ‌యంగా న‌గ‌ర పాలిక అధికారుల‌కు ఇచ్చాక నిలిపి వేశారు.

ఇందుకు సంబంధించి భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగాక తిరిగి షాహీన్ బాగ్(Shaheen Bagh) లో కూల్చీవేత‌లు స్టార్ట్ కావ‌డం మ‌రింత ఉద్రిక‌త‌ల‌ను పెంచేలా చేసింది.

సామాన్యులు, పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల వారిని టార్గెట్ చేస్తూ వారి ఇళ్ల‌ను కూల్చి వేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ ఎమ్మెల్యే అమాన‌తుల్లా ఖాన్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు.

ఈ ప్రాంతంలో ఎలాంటి ఆక్ర‌మ‌ణ‌లు లేవ‌ని, ఇది కేవ‌లం రాజ‌కీయాలు చేసేందుకు బుల్ డోజ‌ర్ల‌ను తీసుకు వ‌చ్చారంటూ ఆరోపించారు.

 

Also Read : ఇండిగో బోర్డింగ్ పై సింధియా ఆరా

Leave A Reply

Your Email Id will not be published!