MLC Kavitha : రాముడి పేరుతో రౌడీయిజం సహించం
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
MLC Kavitha : రాష్ట్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు బీజేపీ మరో వైపు టీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు చెందిన మంత్రి మల్లారెడ్డికి కేంద్ర ఐటీ శాఖ చుక్కలు చూపిస్తోంది. ఇదే సమయంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీ ఎత్తున నగదు పట్టుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు పదే పదే రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీకి చెందిన నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
సభ్యత, సంస్కారం మరిచి పోయి ప్రవర్తిస్తున్నారని, వాళ్ల భాష దారుణంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతిని కించ పరిచేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ప్రధానంగా బీజేపీ శ్రేణులు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.
ఇక నుంచి అది తెలంగాణలో చెల్లదన్నారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
దీనిని ఎంత మాత్రం సహించ బోమంటూ హెచ్చరించారు కవిత. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ దొంగ ప్రమాణాలు చేశారంటూ నిప్పులు చెరిగారు.
Also Read : ఇంజనీర్లు..డాక్టర్లను అందిస్తున్నా – మల్లారెడ్డి