Eknath Shinde : ఏక్ నాథ్ షిండేకు అరుదైన చాన్స్
డిప్యూటీ సీఎంతో పాటు మంత్రుల పదవులు
Eknath Shinde : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలి పోయింది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు తెర పడింది. ఎట్టకేలకు తనకు మెజారిటీ లేదని తెలుసుకున్న వెంటనే సీఎం ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు.
రెండున్నర సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కూలి పోయింది. స్వయంగా తానే కారు నడుపుకుంటూ ఠాక్రే గవర్నర్ వద్దకు వెళ్లారు.
రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే దానిని ఆమోదించారు గవర్నర్ కోష్యార్. ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ధిక్కార స్వరం వినిపించారు.
ఆయనతో పాటు 39 మందికి పైగా శివసేన ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వీరి మద్ధతుతో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
దీంతో అత్యధిక స్థానాలు కలిగిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎంగా ఎంపికయ్యేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఆయన రెండోసారా మరాఠా పీఠంపై కూర్చోనున్నారు. దీంతో ఎవరికి ఏయే పదవులు ఇవ్వాలనే దానిపై మంత్రాంగం నడుస్తోంది.
తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడంతో పాటు మరో 9 మందికి పైగా కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దక్కనుంది.
ఇప్పటికే వెనుక నుండి మంత్రాంగం నడుపుతూ వచ్చిన బీజేపీ శాఖలు కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్