Burra Venkatesham : నిరుద్యోగుల కోసం స్ట‌డీ సెంట‌ర్లు

వెల్ల‌డించిన బీసీ సంక్షేమ శాఖ

Burra Venkatesham : రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80 వేల 39 పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా ఊపారు. తాజాగా 30 వేల 443 పోస్టుల భ‌ర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆయా స్ట‌డీ స‌ర్కిళ్ల‌కు పెద్ద ఎత్తున పోటీ ఏర్ప‌డింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈరోజు వ‌ర‌కు అధికారికంగా ఉద్యోగాల భ‌ర్తీలో జాప్యం ఏర్ప‌డింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. మ‌రికొంద‌రు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

ఈ త‌రుణంలో ప‌రిస్థితి తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని ఆదేశించారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థుల కోసం వారు చ‌దువుకునేందుకు గాను బీసీ సంక్షేమ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల స్ట‌డీ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. ఈ మేర‌కు ఉన్న‌త విద్యా శాఖ‌తో క‌లిసి ప్లాన్ రూపొందించే ప‌నిలో ప‌డింది.

ఇదిలా ఉండ‌గా స్ట‌డీ సెంట‌ర్ల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల‌లోని పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల‌ను గుర్తించింది. ప్ర‌స్తుతం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో 11 బీసీ స్ట‌డీ స‌ర్కిళ్లు ఉన్నాయి.

ఉచితంగా వ‌స‌తి క‌ల్పించ‌డంతో పాటు శిక్ష‌ణ ఇస్తున్నారు. మూడు గ‌దులలో డిజిట‌ల్ పాఠాలు, సందేహాల నివృత్తి కోసం, సిల‌బ‌స్ పూర్త‌య్యేలా చేస్తుంది. మూడో గ‌ది ప్రిప‌రేష‌న్ (Burra Venkatesham)కోసం కేటాయిస్తారు.

బీసీలే కాకుండా నిరుపేద‌లు కూడా ఇక్క‌డ చ‌దువు కోవ‌చ్చ‌ని తెలిపింది. స్ట‌డీ మెటీరియ‌ల్ కూడా ఫ్రీగా అందిస్తుంద‌ని ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం వెల్ల‌డించారు.

Also Read : తెలంగాణ‌లో శాఖ‌ల వారీగా పోస్లులు ఇవే

Leave A Reply

Your Email Id will not be published!