S Jai Shankar : ర‌ష్యాతో ఆయిల్ కొనుగోలు క‌రెక్టే – జైశంక‌ర్

ఏ దేశ‌మైనా కొనుగోలు చేయొచ్చు

S Jai Shankar : ర‌ష్యాతో భార‌త్ ఆయిల్ కొనుగోలు చేయ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. దీనిపై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.

తాజాగా ఆయ‌న మ‌రోసారి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఏ దేశాలైతే అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయో ఆ దేశాలు అదే ర‌ష్యాతో గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాయ‌ని దీనిపై ఎందుకు జ‌వాబు ఇవ్వ‌డం లేదంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు.

యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం కుగ్రామంగా మారింది. ఒక దేశం మ‌రో దేశం అనుసంధానం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిని గుర్తించ‌కుండా తాము ఏది చెబితే అదే చ‌ట్టం అనుకుంటే పొర‌పాటు అని స్ప‌ష్టం చేశారు జైశంక‌ర్(S Jai Shankar).

తాము ర‌ష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తే త‌ప్పేంటి అంటూ నిల‌దీశారు. ఎవ‌రికి ఎందుకు అభ్యంత‌రం ఉండాలో అర్థం కావ‌డం లేద‌న్నారు. భార‌త్ ఇప్ప‌టికే అన్ని దేశాల‌తో స‌త్ సంబంధాల‌ను కోరుకుంటుంద‌న్నారు.

తాము దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుంచి శాంతి మంత్రం జ‌పిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్(S Jai Shankar). ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తి దేశానికి ఆయిల్ (పెట్రోల్, డీజిల్ ) అన్న‌ది అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి దేశం అధిక ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు ఉత్త‌మ‌మైన ఒప్పందాన్ని నిర్ధారించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు.

బ్యాంకాక్ లో భార‌తీయ సంఘంతో జ‌రిగిన చ‌ర్చ‌ల సంద‌ర్భంగా జై శంక‌ర్ పాల్గొన్నారు. ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : నిఘా నౌక వల్ల ఎలాంటి ప్రమాదం లేదు – చైనా

Leave A Reply

Your Email Id will not be published!