By Polls Ec : 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు – ఈసీ
ఆరు రాష్ట్రాలు..మునుగోడుకు వేళాయే
By Polls Ec : అంతా ఊహించినట్టుగానే ఉత్కంఠకు తెర దించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు దేశంలోని ఆరు రాష్ట్రాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మొత్తం సీట్లలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా రాష్ట్రాల పరంగా చూస్తే బీహార్ లో 2 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాలలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్(By Polls Ec) జరగనుంది. నవంబర్ 3 పోలింగ్ జరగగా 6న రిజల్ట్ ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా పోలింగ్ కు ఎన్నికల ఫలితాలకు కేవలం మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.
ఉప ఎన్నికలు జరగనున్న వాటిలో రెండు సీట్లు బీహార్ లోని మొకామా, గోపాల్ గంజ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర లోని అంధేరీ ఈస్ట్ లో, హర్యానా లోని ఆదంపూర్ లో , తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు, ఉత్తర ప్రదేశ్ లోని గోలా గోకరానాథ్ తో పాటు ఒడిశా లోని ధామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
రాష్ట్రీయ జనతా దళ్ కు సంబంధించి మొకామా నుండి అప్పటి ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఒక కేసులో దోషిగా తేలిన తర్వాత జూలైలో అనర్హత వేటు వేశారు.
గోపాల్ గంజ్ లో బీజేపీకి చెందిన సుభాష్ సింగ్ మరణించారు. ఇక తెలంగాణలోని మునుగోడులో ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
Also Read : భారత్ జోడో యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు