KCR : సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశం ముగిసింది. రాజధాని హైదారాబాద్ లోని ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ మీటింగ్ లో రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం పూర్తిగా ఆమోదం తెలిపింది. దీంతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
ఈ సమావేశాల సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇదిలా ఉండగా అసెంబ్లీతో పాటు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలంటే ముందు దానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
అందుకే ఇవాళ ప్రత్యేకంగా సీఎం కేసీఆర్(KCR) బడ్జెట్ ప్రతిపాదనలపై పూర్తిగా కసరత్తు చేశారు. రాబోయే రోజుల్లో ఏయే రంగాలకు ఎంతెంత నిధులు కేటాయించాలనేది ఇందులో కీలకం కానుంది.
బడ్జెట్ పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్. ఆయనకు ఇప్పటికే అపారమైన అనుభవం ఉంది. ఎందుకంటే అటు ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరుంది.
అంతే కాదు వివిధ కేబినెట్ లలో పని చేసిన చరిత్ర ఆయనది. ఇప్పటికే ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా, ప్రస్తుతం సీఎంగా పని చేసిన అనుభవం బడ్జెట్ పై ప్రభావం చూపనుంది.
Also Read : ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి