YS Jagan : ఏపీ సీఎం కేబినెట్ విస్తరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎవరు ఉంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ప్లీనరీ పూర్తయ్యాకే మంత్రివర్గ (Cabinet) విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా ఆయన ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా ఫోకస్ పెడుతున్నారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధి (Special Fund) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు జగన్.
వచ్చే నెల ఏప్రిల్ 10 వరకల్లా గ్రామ స్థాయిలో ఉపాధి హామీ సహా అన్ని బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అంతే కాకుండా నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు పూర్తి చేస్తామన్నారు.
ఉగాది పండగను (Ugadi Festival) పురస్కరించుకుని వాలంటీర్లకు సన్మానం, అవార్డులు ఇస్తామని తెలిపారు జగన్ రెడ్డి(YS Jagan ). కాగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రతి నెలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే 10 సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు.
అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. గ్రామాల్లో 20 రోజుల పాటు బూత్ కమిటీలు తిరగాలని సూచించారు. మీరు గెలవాలి. పార్టీని గెలిపించాలి. పార్టీ పవర్ లోకి వచ్చి మూడేళ్లవుతోంది.
ఇక ప్రజల్లోకి కార్యక్రమాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు జగన్ రెడ్డి.(Jagan Reddy ) గ్రామాల్లోని గడప గడప వద్దకు వెళ్లాలని ఇదే మనముందున్న ప్రధాన లక్ష్యమన్నారు.
డోర్ టూ డోర్ కాన్వాసింగ్ చేయాలన్నారు. కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటామని చెప్పారు ఏపీ సీఎం .
Also Read : బతికున్నంత కాలం జగనే ఈ రాష్ట్రానికి సిఎం