Shashi Tharoor : మైనార్టీలు ప్ర‌ధాని కాగ‌ల‌రా – శ‌శి థ‌రూర్

రిషి థ‌రూర్ ను చూసి నేర్చుకోవాలి

Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా మైనార్టీ అయిన హిందువు రిషి సున‌క్ ఇవాళ కొలువు తీరారు. కానీ ఇదే స‌మ‌యంలో భార‌త దేశంలో మైనార్టీల‌కు చెందిన వారు ఎవ‌రైనా ప్ర‌ధాని కాగల‌రా అని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా అనుమానం వ్య‌క్తం చేశారు. ఎంపీ లేవనెత్తిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపాయి. ఒక ర‌కంగా చ‌ర్చ‌కు దారితీశాయి.

ఒక‌నాడు వ‌ద్ద‌నుకున్న రిషి సున‌క్ ను తిరిగి ఎన్నుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాద‌న్నారు. ఒక ర‌కంగా అత‌డు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడ‌ని కితాబు ఇచ్చారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). ప్ర‌ధానంగా భార‌త దేశంలో వైవిధ్యం, ప్రాతినిధ్యం గురించిన చ‌ర్చ‌ను రేకెత్తించారు.

ఎంపీ జాతీయ మీడియాతో మాట్లాడారు. రిషి సున‌క్ ఎన్నిక భార‌త్ కు ఓ పాఠంగా మారాల‌న్నారు. కానీ ఇక్క‌డ మార్పును కోరుకునే వాళ్లు లేర‌ని ఎద్దేవా చేశారు.

హిందువులు, బౌద్దులు లేదా జైనులు , ముస్లింలు కాని ఎవ‌రైనా భార‌త దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కాగ‌ల‌రా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అని ప్ర‌శ్నించారు శ‌శి థ‌రూర్. మైనార్టీల‌కు సాధికార‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

త‌న తోటి కాంగ్రెస్ నాయ‌కుడు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ప‌ది సంవ‌త్స‌రాల పాటు దేశానికి ప్ర‌ధానమంత్రిగా ప‌ని చేశార‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డాన్ని ఉద‌హ‌రించారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎంపీ.

వ్య‌క్తుల్ని లేదా నాయ‌కుల‌ను కులం, మ‌తం ప్రాతిప‌దిక‌గా చూస్తూ పోతే చివ‌ర‌కు ఎవరినీ మ‌నం మ‌న‌స్ఫూర్తిగా స్వీక‌రించలేని స్థితికి దిగ‌జారి పోతామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్. ప్ర‌స్తుతం హిందూత్వం పేరుతో కొన‌సాగుతున్న భావ‌జాలం ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : రిషి సున‌క్ ను చూసి మోదీ నేర్చుకోవాలి

Leave A Reply

Your Email Id will not be published!