#JustinTrudeau : మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ కెనెడా పీఎం జస్టిన్
లింక్ఢ్ ఇన్ టాప్ మోస్ట్ లిస్ట్ రిలీజ్
సామాజిక మాధ్యమాల్లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న లింక్డ్ ఇన్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, నాయకులు , దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, వ్యాపారవేత్తలు, మేధావులను పరిగణలోకి తీసుకుంది ఈ టెక్ దిగ్గజ కంపెనీ. వరల్డ్ వాయిస్ పేరుతో పది మందిని విశిష్టమైన వ్యక్తులుగా ఎంపిక చేసింది. అమెరికా, యుకె, బ్రెజిల్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం జాబితాలో మొదటి ప్లేస్ లో కెనడా దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న జస్టిన్ ట్రుడేయు నిలిచారు. పరిపాలనలో కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడంలో దృష్టి సారించారు. జి – 20 సదస్సులో ఆయా దేశాల మధ్య శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు.
అత్యున్నతమైన పాలనాదక్షుడిగా జస్టిన్ పేరొందారు. రెండవ స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లేగార్డే నిలిచారు. ఇంటర్ నేషనల్ టాక్సేషన్, వుమెన్ ఎంపవరింగ్ లో కీలక మార్పులు తీసుకు వచ్చారు. ఇంటర్ నేషనల్ మోనిటరీ ఫండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచ గతిని పూర్తిగా మార్చే శక్తి అందరికీ లేకపోవొచ్చు కానీ కొంతలో కొంతైనా మార్చగలమన్నది నిరూపితమైంది. ఇక మూడో ప్లేస్ ను చేజిక్కించుకున్నారు రిచర్డ్ బ్రాన్సన్. వర్జిన్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. మోటివేషన్ స్పీకర్ గా, మెంటార్ గా, ట్రైనర్ గా, లీడర్ గా, హ్యూమన్ రిసోర్స్ ఎక్స్పర్ట్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జసిందా ఆర్డెర్న్ నిలిచారు. పాలనా పరంగా అత్యున్నతమైన సేవలు అందించారు. దేశాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకు వెళ్లడంలో కృషి చేశారు. ఐదో ప్లేస్ లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్ పర్సన్ మెలిండా గేట్స్ ఉన్నారు. పీవోటల్ వెంచర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బతుకుల్లో వెలుగులు నింపుతోంది. ఇక ఆరవ స్థానంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏమాన్యువల్ మాక్రాన్ నిలిచారు. పర్యావరణం, ప్రజా సంక్షేమం ప్రాధామ్యాలుగా పాలన సాగిస్తున్నారు.
నోవార్టిస్ సిఇఒగా ఉన్న వాస్ నరసింహ్మన్ ఏడో స్థానంలో ఉన్నారు. చిన్నపాటి గదిలో స్టార్ట్ అయిన ఈ కంపెనీని 205 ట్రిలియన్ డాలర్ల కు చేర్చాడు. మెడిసిన్స్ లో వరల్డ్ వైడ్ గా టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. ఎనిమిదో ప్లేస్ లో ఐకియా కంపెనీ సిఇఓ జెస్పెర్ బ్రోడిన్ నిలిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీగా పేరొందింది. ఈ కంపెనీలో ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుంది. తొమ్మిది, పదో స్థానాల్లో నా బోటిన్, విన్నీ నిలిచారు. మొత్తం మీద టాప్ ప్లేస్ లో నిలిచినా వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
No comment allowed please