Canada Work Permits : భార‌తీయుల‌కు కెన‌డా బంప‌ర్ ఆఫ‌ర్

2023 నుంచి రావ‌చ్చ‌ని స‌ర్కార్ ప్ర‌క‌ట‌న

Canada Work Permits : అమెరికా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రి దెబ్బ‌కు వీసాలు రాక నానా తంటాలు ప‌డుతున్నారు భార‌తీయులు. ప్ర‌త్యేకించి నైపుణ్యం క‌లిగిన వారితో పాటు చ‌దువుకునేందుకు, ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య ప‌నుల కోసం వెళ్లాల‌ని అనుకునే వారికి కోలుకోలేని షాక్ ఇచ్చింది యుఎస్.

ఇప్ప‌టికే వీసాల జారీలో తీవ్ర ఆలస్యం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో అమెరికా ఎందుకు మా దేశానికి రావాల‌ని కోరుతోంది కెన‌డా ప్ర‌భుత్వం. ఈ మేర‌కు భార‌తీయుల‌కు తీపిక‌బురు చెప్పింది. ప్రొఫెష‌న‌ల్స్ , కార్మికులు, విద్యార్థులు..ప్ర‌తి ఒక్క‌రికీ స్వాగ‌తం పలుకుతోంది.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే ఫ్యామిలీలంతా రావ‌చ్చంటూ తెలిపింది. అంత‌ర్జాతీయ ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు వ‌ర్క్ ప‌ర్మిట్ ల‌ను విస్త‌రించ‌డంలో భార‌తీయ నిపుణులు, ఇత‌ర విదేశీయుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంది కెనడా ప్ర‌భుత్వం(Canada Work Permits) .

కెనడా ఇమ్మిగ్రేష‌న్ , శ‌ర‌ణార్థులు, పౌర‌స‌త్వ శాఖ మంత్రి సీన్ ఫ్రేజ‌ర్ వ‌ర్క్ పర్మిట్ ల‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు ముందు ప్ర‌ధాన ద‌ర‌ఖాస్తుదారు ఉన్న‌త నైపుణ్యం క‌లిగిన వృత్తిలో ప‌ని చేస్తున్న‌ట్ల‌యితే జీవిత భాగ‌స్వాములు వ‌ర్క్ ప‌ర్మిట్ కు అర్హులు.

ఈ తాత్కాలిక చ‌ర్య కుటుంబాల‌ను క‌లిసి ఉండేలా చేస్తుంది. దీని వ‌ల్ల కార్మికుల మాన‌సిక శ్రేయ‌స్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థిర‌త్వం క‌లిగి ఉండేలా చేస్తుంద‌ని పేర్కొన్నారు.

ఈ కొత్త విధానం వ‌ల్ల 2,00,000 మంది కంటే ఎక్కువ భార‌తీయ కుటుంబాల వారు ప‌ని చేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది.

Also Read : జాత్యహంకారం అత్యంత ప్ర‌మాదం – సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!